
రాజ్‌తరుణ్ కొత్త సినిమా భలే ఉన్నాడే. మనీషా కంద్కూర్ కథానాయిక. జె.శివసాయి వర్ధన్ దర్శకుడు. అగ్ర దర్శకుడు మారుతి సమర్పణలో ఎన్.వి.కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 7న సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్‌డేట్ పోస్టర్‌ని కూడా విడుద ల చేశారు. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు. సింగీతం శ్రీనివాస్, అభి రామి, అమ్ము అభిరామి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెల్లా, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: రవికిరణ్ ఆర్ట్స్.
