కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. కేథరిన్, సంయుక్తా మీనన్ కథానాయికలు. వశిష్ఠ్ దర్శకుడు. హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా గత వారం రిలీజైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో కల్యాన్ రామ్ మాట్లాడుతూ బింబిసార రిలీజ్ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఇంత మంచి కథను నాకు ఇచ్చిన వశిష్ఠ్కు ధన్యవాదాలు అని అన్నారు. ఎంతో నమ్మకంతో సినిమాను పూర్తి చేశాం. కానీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే కొంతమంది మాటలు విటే భయమేసేది. అంతే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నమ్మాను. బింబిసార విషయంలో అదే నిజమైంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతు మేజర్, విక్రమ్ సినిమాలు మంచి విజయాన్ని చూశాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు సినిమాలేవీ ఆశించినస్థాయిలో సక్సెస్ కాదు. బింబిసార, సీతారామం ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదే ఉత్సాహంతో నేను కూడా ముందుకెళతాను అన్నారు. మా సినిమా ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు వశిష్ఠ్. డిస్ట్రిబ్యూటర్లు శివరాం, ఎల్.వి.ఆర్. హరి, ఎ.ఎం.ఆర్ పాల్గొన్నారు.














