కోవిడ్‌ను నియంత్రించాలన్న ఉద్దేశంతో ఇటలీలో కొత్త ఆంక్షలను విధించారు. జనవరి 15వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లను మాత్రమే సినిమా థియేటర్‌లోకి రానిస్తున్నారు. లైవ్ మ్యూజిక్ వేదికలు, క్రీడా ఈవెంట్లకు కూడా వ్యాక్సినేట్ అయితేనే అనుమతి కల్పిస్తున్నారు. కోవిడ్ గ్రీన్ పాస్ చూపిస్తేనే ఎంట్రీ కల్పించనున్నారు. హోటళ్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లోనూ గ్రీన్ పాస్ తప్పనిసరి. ఈ రోజు నుంచే ఇటలీలో ఈ ఆంక్షలను అమలు చేశారు. అక్టోబర్ మధ్య నుంచి ఇటలీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆస్ట్రియాలోని వ్యాక్సిన్ వేసుకోని వారికి లాక్‌డౌన్ విధిస్తున్నారు. జర్మనీలో పబ్లిక్ ప్రదేశాలను అనుమతి ఇవ్వడం లేదు. గ్రీసులో వ్యాక్సిన్ వేసుకొని వారి నుంచి భారీగా జరిమానాలు వసూల్ చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)