విడాకులు మంజూరయినప్పటికీ, మైనార్టీ తీరే వరకు కుమారుణ్ని పోషించే బాధ్యత తండ్రిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోషణ ఖర్చుల కింద మేజర్ అయ్యే వరకు కుమారునికి ప్రతి నెలా రూ.50 వేల వంతున ఇవ్వాలని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశిచింది. ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి, ఆయన భార్యకు మధ్య వివాదంలో ఈ తీర్పు నిచ్చింది. వారి గోడవలు ఎలా ఉన్నప్పటికీ బాలుని చదువు, ఇతర ఖర్చులను తండ్రే భరించాలని కోర్టు ఆదేశించింది. పుట్టినింటిలో ఉన్న తల్లికి ఎలాంటి సంపాదన లేదని గుర్తుచేసింది. సొమ్ము పంపించే ఏర్పాట్లు చూడాలని ఆర్మీ అధికారులను ఆదేశించింది.














