
దేవర 2 రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలుకానున్నదని నిర్మాత సుధాకర్ మిక్కిలినేని తెలిపారు. ప్రస్తుతం తారక్ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్‌నీల్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తీస్తున్నాడని వినికిడి. త్వరితగతిన ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసి, మే నుంచి దేవర 2 సెట్‌లోకి తారక్ ఎంట్రీ ఇస్తారట. కథలో భారీగా మార్పులు జరిగాయని, షూటింగ్ షెడ్యూల్ కూడా ఫైనల్ అయ్యిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చిత్రబృందం చెబుతున్నది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే.















