ప్రియదర్శి, నభానటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం డార్లింగ్. వై దిస్ కొలవెరి ఉపశీర్షిక. అశ్విన్‌రామ్ దర్శకత్వం. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి, నభానటేష్ పాత్రలు నవ్యరీతిలో సాగుతాయి. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నరేష్, సంగీతం: వివేక్‌సాగర్, దర్శకత్వం: అశ్విన్‌రామ్.