Skip to main content

Namaste NRI

ప్రియదర్శి, నభా నటేష్‌ల డార్లింగ్‌ షూటింగ్‌ పూర్తి

ప్రియదర్శి, నభానటేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం డార్లింగ్‌. వై దిస్‌ కొలవెరి ఉపశీర్షిక. అశ్విన్‌రామ్‌ దర్శకత్వం. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి, నభానటేష్‌ పాత్రలు నవ్యరీతిలో సాగుతాయి. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నరేష్‌, సంగీతం: వివేక్‌సాగర్‌, దర్శకత్వం: అశ్విన్‌రామ్‌.

Social Share Spread Message

Latest News