Namaste NRI

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. చికాగోలోని ఇండియానా నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చికాగోలో వారం రోజుల్లో తుపాకీకి ఆరుగురు బలయ్యారు. కాల్పుల జరిపిన అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడని, అతనికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events