జెమిని సురేష్, అఖిలనాయర్ జంటగా రూపొందుతున్న చిత్రం ఆత్మకథ. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. వారాహి ఎంటైర్టెన్మెంట్ ప్రై.లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో జెమినీ సురేశ్ తల్లి జెమిని సుబ్బలక్ష్మి క్లాప్ ఇవ్వగా, టి.ప్రసన్నకుమార్, జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులంతా ఆకాంక్షించారు. 18ఏండ్ల నా కల నేటికి నెరవేరుతున్నది. ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాను.ఆ అవకాశం ఈ ఆత్మకథ చిత్రంతో దక్కింది అని జెమినీ సురేశ్ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో భాగమైనందుకు కథానాయిక అఖిల సంతోషం వెలిబుచ్చారు. కథే ఈ సినిమాకు హీరో అని, జెమినీ సురేశ్, సమ్మెట గాంధీ ఈ కథకు రెండు పిల్లర్స్ వంటివారని దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి తెలిపారు. ఇంకా సమ్మెట గాంధీ, సంగీత దర్శకుడు శ్రేయాస్ కూడా మాట్లాడారు. బలగం విజయలక్ష్మి, చిన్ను, ధనరాజ్, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.వి.గోపి.
















