డార్లింగ్ ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ప్రాజెక్ట్ స్పిరిట్ షూటింగ్ ఎట్టకేలకు నేడు అధికారికంగా ప్రారంభమైంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ముహూర్తపు వేడుక ఘనంగా జరిగింది. స్పిరిట్ టీమ్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ముహూర్తపు పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి క్లాప్‌తో తొలి షాట్‌ను చిత్రీకరించినట్లు సమాచారం.

ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి.సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు.















