Skip to main content

Namaste NRI

మెగాస్టార్ క్లాప్‌తో మొదలైన స్పిరిట్ 

డార్లింగ్ ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్‌ యాక్షన్ ప్రాజెక్ట్ స్పిరిట్ షూటింగ్ ఎట్టకేలకు నేడు అధికారికంగా ప్రారంభమైంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ముహూర్తపు వేడుక ఘనంగా జరిగింది. స్పిరిట్ టీమ్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ముహూర్తపు పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి క్లాప్‌తో తొలి షాట్‌ను చిత్రీకరించినట్లు సమాచారం.

ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి.సిరీస్‌ ఫిల్మ్స్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై భూషణ్‌కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events