రాజ్‌తరుణ్ హీరోగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. దీనికి తిరగబడరా సామి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా, కె.ఎస్. రామారావవు కెమెరా స్విచ్చాన్ చేశారు. పోకూరి బాబూ రావు దర్శకుడిగా స్క్రిప్ట్ అందించారు. కొత్తదనం నిండిన కథాంశంతో చక్కటి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందించనున్నాం. రాజ్‌తరుణ్ సరికొత్తగా కనిపిస్తారు. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం అని చిత్ర వర్గాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీరశంకర్, రాజా వన్నెం రెడ్డి, నిర్మాతలు టి.ప్రసన్న కుమార్, బెక్కెం వేణుగోపాల్, డీయస్ రావు, నటి`నిర్మాత జీవితా రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి. ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బెక్కం రవీందర్.














