లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ (లాట) నూతన కార్యనిర్వాహక బృందం, డైరెక్టర్ మండలి తాజాగా బాధ్యతలు చేపట్టాయి. సుధీర్ పొత్తూరి, సురేష్ బాబు అంబటి నాయకత్వంలో కార్యనిర్వాహక వర్గం, డైరెక్టర్ మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని స్థానిక షిరిడీ సాయిబాబా మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగువారు, స్వచ్ఛంద సేవకులు, మిత్రులు హాజరై శుభాభినందనలు తెలియజేశారు.

స్వచ్ఛంద సేవకులే ప్రముఖులుగా లాట సంస్థ కార్యకలాపాలు సాగిస్తోందని కార్యవర్గం ఈ సందర్భంగా తెలియజేసింది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, సాంకేతిక శిక్షణ తరగతులను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకువెళతామని సభ్యులు తెలిపారు. తెలుగు వారెవరికైనా ప్రత్యేక సహాయం కావాల్సినప్పుడు లాట కార్యవర్గాన్ని సంప్రదించవచ్చని అన్నారు. త్వరలో సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యోన్ముఖులమయ్యామని చెప్పారు. మనసును రంజిపజేసే సాంస్కృతిక కార్యక్రమాలలో తెలుగు వారందరూ పాల్గొనాలని, ఇదే తమ ప్రత్యేక ఆహ్వానమని లాట కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు.

లాట నూతన కార్యవర్గం:
అధ్యక్షులు: సుధీర్ పొత్తూరి, ఉపాధ్యక్షులు: చంద్రశేఖర్ గుత్తికొండ, కార్యదర్శి: శ్రీకాంత్ వల్లభనేని , సంయుక్త కార్యదర్శి: విష్ణు యలమంచి, కోశాధికారి: సూర్య భమిడిపాటి , సంయుక్త కోశాధికారి: సుధా రాణి దావులూరి, సభ్యులు: అరుణ మధ్యానమ్, పృథ్వీష్ కాసుల.

లాట డైరెక్టర్ మండలి:
ఛైర్మన్: సురేష్ బాబు అంబటి, సభ్యులు: అలేఖ్య గరికపర్తి, భార్గవి దేవిడి, హరిబాబు నేతి, నరేంద్ర కవర్తపు, ప్రతాప్ మేథరమిట్ట, ప్రతాప్ చెరుకూరి, శ్రీకాంత్ అమినేని, సునీల్ కుమార్ మల్లెల, ఉమ కాట్రు వెంకట క్రిష్ణ బోసం, వెంకట పూసర్ల.
















