Namaste NRI

అమెరికాకు తాలిబన్‌ కొత్త డిమాండ్‌

తాలిబన్‌ రాజ్యం ఆప్ఘనిస్థాన్‌లో భారీ కూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం వల్ల సుమారు 1150 మంది మృత్యువాత పడ్డారు.అలాగే 1600 మందికి పైగా గాయాలపాయల్యారు. ఈ క్రమంలో ఆఫ్ఘాన్‌ ప్రభుత్వ ముందుకొచ్చిన అమెరికాకు కొత్త డిమాండ్‌ వినిపించింది. తాలిబన్లు ఆఫ్ఘాన్‌ను స్వాధీనం చేసుకోవడంతో జప్తు చేసిన ఆ దేశపు నిధులను విడుదల చేయాలని కోరింది. కాబూల్‌లో తాలిబన్‌ విదేశాంగ మంత్రి అమిర్‌ ఖాన్‌ ముత్తాఖి మీడియాతో మాట్లాడుతూ  ఈ కష్టకాలంలో ఫ్రీజ్‌ చేసిన ఆఫ్ఘానిస్తాన్‌ ఆస్తులను విడుదల చేయాలని, ఆఫ్ఘాన్‌ బ్యాంకుపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని అమెరికాను కోరుతున్నామన్నారు. ఇలా చేస్తే సహాయం చేసే ఏజెన్సీలు ఆఫ్ఘనిస్థాన్‌కు సహకారం అందించడం సులభం అవుతుందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events