తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ కొత్త ప్రభుత్వం తమ పౌరులకు పాస్‌పోర్టులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కౌన్సిల్ మినిస్టర్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పౌరులకు పాస్‌పోర్టులతో పాటు తజ్కిరా (జాతీయ ఐడీ కార్డు)ను కూడా జారీ చేస్తామన్నారు. ఆగస్టు 15న అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరువాత ఈ రెండిరటి జారీ నిలిచిపోయింది. రోజుకు 5,000` 6,000 పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తామని పాస్‌పోర్ట్ కార్యాలయం తాత్కాలిక హెడ్ అలామ్ గుల్ హక్కానీ తెలిపారు.
కార్యాలయంలోని మహిళ ఉద్యోగులు మహిళలకు సంబంధించిన పాస్‌పోర్ట్ వ్యవహారాలు చూస్తారని సూచించారు. లక్ష పాస్‌పోర్ట్‌లు ప్రాథమిక దశలో పరిశీలనలో ఉండగా, 25 వేల పాస్‌పోర్ట్‌లు చివరి దశలో ఉన్నాయని అంతర్గాత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఖరీ సయిద్ ఖోస్తి తెలిపారు.














