Namaste NRI

కార్తీ, కృతిశెట్టి సినిమా.. వా వాతియార్ టీజర్ వచ్చేసింది

త‌మిళ న‌టుడు కార్తీ, సూర్య త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. రీసెంట్‌గా స‌త్యం సుంద‌రం సినిమాతో మంచి హిట్ అందుకున్న కార్తీ మ‌రో సినిమాను విడుద‌ల‌కు రెడీ చేశాడు. కార్తీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం వా వాతియార్. నలన్ కుమారస్వామి ద‌ర్శ‌క‌త్వం. ఈ చిత్రంలో కీర్తి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, సత్యరాజ్, రాజ్‌కిరణ్, జిఎం సుందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన చిత్ర‌బృందం తాజాగా టీజ‌ర్‌ను వ‌దిలింది. ఈ టీజ‌ర్ చూస్తుంటే కార్తీ మ‌రో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. టీజ‌ర్ చూస్తుంటే సిరుత్తై, ఖాకి, స‌ర్ధార్ చిత్రాల త‌ర్వాత మ‌ళ్లీ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు కార్తీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events