మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆరంభం. అజయ్ వి. నాగ్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని అభిషేక్.టి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను యువ హీరో నాగచైతన్య విడుదల చేశారు. థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిం చిందని నాగచైతన్య చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఒక కేసుకు సంబంధించిన పరిశోధన నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. క్రైమ్ ఇన్సిడెంట్ చుట్టూ నడిచే ఈ కథలో అనూహ్య మలుపులుం టాయని, సరికొత్త కథ, కథనాలతో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దేవ్ దీప్ గాంధీ కుండు, సంగీతం: సింజిత్ యర్రమిల్లి, సంభాషణలు: సందీప్ అంగడి, దర్శకత్వం: అజయ్ నాగ్ వీ.