Namaste NRI

డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా బ్యాడ్ గాళ్స్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

అంచల్‌ గౌడ, పాయల్‌ చెంగప్ప, రోహిణి, యష్ణ, రోహన్‌ సూర్య, మొయిన్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం బ్యాడ్‌ గాళ్స్‌. కానీ చాలా మంచోళ్లు అనేది ఉపశీర్షిక. రేణు దేశాయ్‌ ప్రత్యేక పాత్ర పోషించారు. ఫణి ప్రదీప్‌ దూళిపూడి దర్శకుడు. శశిధర్‌ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్‌ నిర్మాతలు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. అగ్ర దర్శకుడు మారుతి ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.

జాతిరత్నాలు, మ్యాడ్‌ లాంటి హిలేరియస్‌ కామెడీ చిత్రాలను అమ్మాయిలతో చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని, ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయని, ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇదని దర్శకుడు ఫణిప్రదీప్‌ దూళిపూడి చెప్పారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 25న విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్లి గణేశ్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events