రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా బొమ్మలకొలువు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర విశేషాలను యూనిట్ వెల్లడిరచారు. నిర్మాత ఏవీఆర్ స్వామి మాట్లాడుతూ థ్రిల్లర్ కథా చిత్రమిది. కరోనా సమయంలో ఆ పరిస్థితులను ఆధారంగా చేసుకుని నిర్మించాం. ఏప్రిల్ 22న సినిమా విడుదల చేస్తున్నాం అన్నారు. మాళవిక మాట్లాడుతూ నా పుట్టినరోజు నాడే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించటం చాలా ఆనందంగా ఉందన్నారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ నిర్మాత స్వామి నాపైన నమ్మకంతో రెండో చిత్రం చేసే అవకాశం ఇచ్చారు. ఇది అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు. రచయిత వీబీఎస్ రవి అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి నాయిక మాళవిక, దర్శకుడు సుబ్బు తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రానికి సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఏవీఆర్ స్వామి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ప్రవీణ్ లక్కరాజు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)