అందాల భామలు రెజీనా కసాండ్రా, నివేదా థామస్ టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం శాకిని డాకిని. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్‌లపై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. చిత్ర ట్రైలర్ విడుదల చేయడంతో పాటు హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న శాలిని, దామిని అనే ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసుల కథ ఇది. కొరియన్ సినిమా మిడ్‌నైట్ రన్నర్స్‌కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. మైకీమెక్‌క్లియరీ, నరేష్ కుమారన్ స్వరాలందించారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)