భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామి ఏదీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది చైనా. కానీ ఈ చైనాను అమెరికా దాటేసింది. ఇప్పటికు వరకు భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంటూ వస్తున్న చైనాను అమెరికా వెనక్కి నెట్టేసింది. ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద ట్రేడ్ పార్టనర్ ఏ దేశం అంటే అమెరికా చెప్పాల్సి ఉంటుంది. గతేడాది భారత్‌తో అత్యధిక వ్యాపారం చేసిన దేశంగా అమెరికా నిలిచినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ప్రకటించింది. 2021`22 ఆర్థిక సంవత్సరంలో అమెరికా` భారత్ మధ్య 119.42 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగినట్టు వెల్లడిరచింది. వాణిజ్య శాఖ అంచనా ప్రకారం అంతకు ముందు ఏడాది అంటే 2021`21 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యాపారం విలువ 80.51 బిలియన్ డాలర్లుగా ఉండేది. గతేడాది అమెరికా`భారత్ మధ్య గణనీయమైన వ్యాపారం జరిగింది. ఎగుమతులు, దిగుమతులు రెండూ భారీగా పెరగడమే దీనికి కారణం. చైనాను కొన్ని ఏళ్లుగా భారత్‌కు పక్కన పెడుతూ వస్తున్నది.
