అమెరికా కాన్సులేట్ కార్యాలయం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో నిర్మించిన నూతన భవనంలోకి మారనున్నది. నూతన కార్యాలయాన్ని ఈ నెల 20న ఉదయం 8. 30 గంటలకు అట్టహాసంగా ప్రారంభించనున్నట్టు కాన్సులేట్ తెలిపింది. ఈ భవనాన్ని 34 కోట్ల డాలర్లు (దాదాపు రూ.2,785కోట్లు) వెచ్చించి అత్యాధునిక వసతులతో నిర్మించినట్టు పేర్కొన్నది. ఇది భారత్-అమెరికా మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నదని చెప్పింది. ఈ మార్పు నేపథ్యంలో బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో ఉన్న ఆఫీస్ కార్యకలాపాలను ఈ నెల 15 మధ్యాహ్నం 12 నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ సమయంలో అమెరికా పౌరులెవరైనా అత్యవసర సేవలు పొందాలనుకుంటే +9140 40338300 నెంబర్‌పై కాల్ చేయాలని సూచించారు. కొత్త కార్యాలయం ప్రారంభమైన తర్వాత +9140 69328000 నెంబర్‌పై సంప్రదించాలి. మార్చి 20 ఉదయం 8.30 గంటలకు కాన్సులేట్‌ను మూసివేస్తున్నట్టు వెల్లడించింది. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ప్రకటించింది.