Namaste NRI

ది వారియర్‌ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

రామ్‌ పోతినేని హీరోగా, లింగుస్వామి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ది వారియర్‌. కృతి శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించారు. ఈ నేపథ్యంలో ప్రచార పర్వంలో భాగంగా జులై 1న సాయంత్రం 7:57 గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ పోస్టర్‌లో రామ్‌ ఇంటెన్సీవ్‌ లుక్స్‌తో చేతిలో టార్చ్‌ పట్టుకుని ఎవర్నో కోపంగా చూస్తున్నారు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కొత్తదనం నిండిన ఓ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందించాం. ఇందులో రామ్‌ శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఆయన లుక్‌, నటన చాలా కొత్తగా ఉంటాయి అని చిత్ర వర్గాలు తెలిపాయి. శ్రీనివాస్‌ సిల్వర్‌ స్కీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా,  ఛాయాగ్రహణం : సుజీత్‌ వాసుదేవ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events