అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి విమర్శలు చేశారు. ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని, వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై రచ్చ జరుగుతోంది.
చైనా నుంచి భారీ సంఖ్యలో పౌరులు వస్తున్నారు. వారిదంతా సైన్యం వయసే. అందులోనూ పురుషులే అధికం. వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు యత్నిస్తున్నారా? అనిపిస్తోంది. వారి ప్రయత్నం కూడా అదేనా? అని పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ వ్యాఖ్యానించారు. మిలిటరీ ఏజ్ లో ఉన్న ఆ దేశ పౌరులు ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని, వాళ్లు సైన్యంగా మారి దాడిచేస్తారని పుతిన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.