అమెరికాలో అద్భుత విజయాలు సాధించిన భారతీయ అమెరికన్లలో కశ్మీరీ పండిట్లు ముందు వరుసలో ఉన్నారని అమెరికా చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. కశ్మీర్ పండిట్ల వలసలే కథాంశంగా నిర్మించిన ఓ సినిమాకు సంబంధించిన వేడుకకు రాజా కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ప్రగతిలో వారి పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. సర్వస్వాన్నీ కోల్పోయి ప్రాణాలు రక్షించుకునేందుకు పరిగెతున్నప్పుడు జీవితం అసలు అర్థం తెలుస్తుందన్నారు. మనం ఎక్కడ, ఏ స్థితిలో ఉన్న జీవితాన్ని వేడుకలో చూడటం, మూలాలూ మర్చిపోకుండా ఉండటం తెలుస్తుందన్నారు. కశ్మీర పండిట్లు ఎదుర్కొన్న సవాళ్లు ఇతరులెవ్వరూ ఎదుర్కోలేదని అన్నారు.














