ఉక్రెయిన్ లో తమ లక్ష్యాలను సాధిస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. ఈ దిశగా సహనం, పట్టుదలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. యుద్ధరంగంలో తమ లక్ష్యాను సాధించేందుకు కొంత సమయం పడుతుందని, ఈ విషయంలో తాము తొందరపడటం లేదని తెలిపారు. ఉక్రెయిన్ వ్యవహారం లో పట్టుదల, సహనం, బలమైన సంకల్పంతో ఉన్నాం. రష్యా ప్రజలకు, దేశానికి సంబంధించి ఎంతో కీలకమైన లక్ష్యాలను సాధిస్తామని విశ్వసిస్తున్నా అని అన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరగాలంటే డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్ జపోరిజియాలను రష్యాలో అంతర్భాగంగా గుర్తించాలన్న మాస్కో వైఖరిని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలపై రష్యా పూర్తిస్థాయిలో పట్టు సాధించలేదు. అయితే మాస్కో అంతిమ లక్ష్యం ఇదేనని ఆయన వెల్లడిరచారు.
