బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్, ఆ దేశంలో విద్యార్థుల నిరసనలపై ప్రశంసలు కురిపించారు. మాజీ ప్రధాని షేక్ హసీనాను రాకాసితో పోల్చారు. విద్యార్థులు దేశంలో తెచ్చిన విప్లవంతో రాకాసిని పారదోలారు. మీరు (విద్యార్థులు) సాధించింది అసమాన్యమైంది. మీరంటే నాకెం తో గౌరవం. అందుకే మీ ఆదేశాలను పాటించా అని యూనస్ అన్నారు. మరోవైపు, దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.