
ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి జంటగా నటిస్తున్న చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ మారుమూల గ్రామంలో ఒక ప్రాజెక్ట్‌ను సూపర్‌వైజ్ చేయడానికి వచ్చిన సివిల్ ఇంజనీర్ అక్కడి గ్రామానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడటం, వారి ప్రయాణం నేపథ్యంలో ట్రైలర్ సాగింది. బ్యూటీఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇదని, కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని దర్శకులు తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగే ఈ ప్రేమకథ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ప్రదీప్ మాచిరాజు పేర్కొన్నారు. వెన్నెల కిషోర్, సత్య, గెటప్‌శ్రీను, మురళీధర్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్, నిర్మాణ సంస్థ: మాంక్స్ అండ్ మంకీస్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నితిన్-భరత్.
