Namaste NRI

ఈ మూడు దేశాలకూ మంచి భవిష్యత్తు ఉండొచ్చు: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

తియాన్‌జిన్‌లో ఇటీవల జరిగిన షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీఓ) తర్వాత భారత్‌, రష్యాలను మనం చైనాకు కోల్పోయినట్టుగా కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చైనాకు భారత్‌, రష్యాలను మనం కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. బహుశా ఆ మూడు దేశాలకు కలిపి మంచి భవిష్యత్తు ఉండవచ్చు తెలిపారు.

రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 80 ఏండ్లు అయిన సందర్బాన్ని పురస్కరించుకుని చైనాలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుతిన్‌, ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌లతో కలిసి జిన్‌పింగ్‌ అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాగా దీనిపై చైనా జాతీయ ప్రతినిధి స్పందిస్తూ.. ఏ దేశంతోనైనా చైనా దౌత్య సంబంధాలు వృద్ధి చేసుకుందంటే తృతీయ దేశానికి వ్యతిరేకంగా ఎన్నటికీ కాదని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News