ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాల ప్రజలకు రష్యా పౌరసత్వం, పాస్‌పోర్టులను అందజేస్తున్నారు. దీని కోసం మెలిటోపోల్‌లో మైగ్రేషన్ సర్వీస్ కార్యాలయాన్ని రష్యా ప్రారంభించింది. రష్యా పౌరసత్వం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి రష్యా పాస్‌పోర్టులను అందజేస్తున్నది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల్లో వేలాది మంది ఉక్రెయిన్ ప్రజలు రష్యా పౌరతస్వం, పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తున్నది. కాగా ఉక్రెయిన్ స్వాధీన ప్రాంతామైన ఖేర్‌సన్, జపోరిరaజియా ప్రాంతాలకు కూడా దీనిని విస్తరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారులను ఆదేశించారు.














