Namaste NRI

ఆలస్యం కాకముందే వాళ్లు త్వరగా మేల్కొనాలి .. ట్రంప్‌ హెచ్చరిక

పశ్చిమాసియా యుద్ధంలో కాల్పుల విరమణపై ఇప్పట్లో ఒప్పందం కుదిరే అవకాశం కనపడడం లేదు. ఇరాన్‌తో మధ్యవర్తులు చర్చిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించగా అటువంటిదేమీ లేదంటూ ఇరాన్‌ తేల్చేసింది. తాజాగా ట్రంప్‌ మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీచేశారు. తాను అందజేసిన శాంతి ప్రతిపాదనలను తీవ్రంగా పట్టించుకోవాలని ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ను నాసిరకం యోధులు, గొప్ప సంధానకర్తలుగా అభివర్ణిస్తూ చర్చల కోసం ఇరానే వేడుకుంటున్నదని ట్రంప్‌ చెప్పారు. ఇరాన్‌తో యుద్ధంలోకి ప్రవేశించిన తర్వాత మొదటిసారి క్యాబినెట్‌ సమావేశంలో పాల్గొనడానికి ముందు విలేకరులతో ట్రంప్‌ మాట్లాడుతూ యుద్ధానికి దౌత్యపరమైన పరిష్కారం కోసం తపిస్తున్నది ఇరానే తప్ప అమెరికా కాదని చెప్పారు. టెహ్రాన్‌ నుంచే ఒత్తిడి వస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందం చేసుకునేది వాళ్లే(ఇరాన్‌) తప్ప నేనుకాదు అని ఆయన చెప్పారు. కాగా, ఇరానియన్‌ సంధానకర్తలు చాలా భిన్నంగా, విచిత్రంగా ఉన్నారు.

సైనికపరంగా పూర్తిగా నాశనమై మళ్లీ పుంజుకునే అవకాశం లేని కారణంగా వారు ఒక ఒప్పందం కోసం మమల్ని వేడుకోవాలి. అయినప్పటికీ వారు కేవలం మా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారు. అది తప్పు అంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఆలస్యం కాకముందే వాళ్లు త్వరగా మేల్కొనాలి. ఎందుకంటే ఒకసారి అలా జరిగితే వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. దాని పర్యవసానం మాత్రం బాగుండదు అంటూ ఇరాన్‌ని ఆయన హెచ్చరించారు. అయితే అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events