అమెరికాలో డొమెస్టిక్ విమాన సర్వీసులు వినియోగించే వారికి కూడా కరోనా టీకాలు తప్పనిసరి చేయాలని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథొనీ ఫౌచీ ప్రభుత్వానికి సూచించారు. టీకా కచ్చితంగా తీసుకోవాలన్న నిబంధన అమలు చేస్తే దేశంలో టీకా మరింత వేగవంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ సూచన చేశారు. అమెరికాలో ఇప్పటి వరకు 62 శాతానికి పైగా ప్రజలు కరోనా టీకా తీసుకున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)