అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కష్టాన్ని తెచ్చిపెట్టారు. వారిలో కొందరిపై దేశ బహిష్కరణ పిడుగు వేశారు. పలువురి వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వారు స్వచ్ఛందంగా అమెరికాను వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ వందలాది మందికి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ (డీఓఎస్) నుంచి ఈ-మెయిళ్లు అందాయి.

ఇలా అందుకున్న వారిలో భారతీయులు కూడా ఉన్నట్టు తెలిసింది. వీసాలు రద్దయిన వారు తక్షణం దేశాన్ని విడిచి వెళ్లాలని, లేదంటే తామే బలవంతంగా తరలిస్తామని హెచ్చరించింది. హెచ్చరిక ఈ మెయిళ్లు అందుకున్న వారు తమ దేశాలకు వెళ్లానుకుంటే సీబీపీ హోమ్ యాప్‌ను వినియోగించుకోవచ్చునని ప్రభుత్వం వారికి సూచించింది.
