
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందిన ఎంటైర్టెన్మెంట్ డ్రామా కె-ర్యాంప్. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేశ్ దండా, శివ బొమ్మకు నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు. టిక్కల్ టిక్కల్ ఢమాల్ ఢమాల్ కలిసి వచ్చే కాలం ముందు నువ్వు సూపర్‌రా.. టైమ్ కాస్త బ్యాడ్ అయితే.. కె ర్యాంప్‌రా అంటూ సాగే ఈ పాటను సురేంద్ర కృష్ణ రాయగా, చేతన్ భరద్వాజ్ స్వరపరిచారు. సాయిచరణ్ భాస్కరుని ఆలపించారు. ప్రేమ, ప్రేమికురాలి మధ్య హీరో ఎలా నలిగిపోయాడో ఈ పాట తెలియజేస్తున్నది. నరేశ్, సాయికుమార్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 18న దీపావళి కానుకగా సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, నిర్మాణం: హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్.















