టాలీవుడ్ నటుడు మసూద ఫేమ్ తిరువీర్ పెళ్లి చేసుకున్నాడు. తన జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించినట్లు వెల్లడించాడు. కల్పనారావ్ అనే అమ్మాయితో తిరువీర్ ఏడడుగులు వేశాడు. ఇక ఈ వివాహం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగినట్లు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి తిరువీర్ సోంత ఊరు. నటనపై ఇంట్రెస్ట్ ఉన్న ఈ నటుడు మొదట్లో రేడియో జాకీగా పని చేశాడు. ఆర్జే తిరూ అంటూ శ్రోతలను పలకరించిన అతడు బొమ్మలరామారం చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత జార్జిరెడ్డి, పలాస 1978, టక్ జగదీశ్ సినిమాలతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది మసూద సినిమాతో సోలో హీరోగా సూపర్ హిట్‌ను ఖాతా లో వేసుకున్నాడు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, ప్రతీ సినిమాకు తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ హీరోగా ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉన్నాడు తిరువీర్. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తిరువీర్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.