బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాలో వన్ ఆఫ్‌ది హీరోయిన్గా నటించింది ప్రగ్యా జైస్వాల్. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రగ్యా విలేకరులతో ముచ్చటించింది. ఇందులో నా పేరు కావేరి. అభినయానికి ఆస్కారమున్న డీ గ్లామరస్ రోల్. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్ర. ఛాలెంజ్‌గా తీసుకొని చేశాను. దర్శకుడు బాబీ ఈ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు అని తెలిపారు.
బాలకృష్ణగారితో వరుసగా సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. అఖండ తో నా కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు డాకు మహారాజ్ లాంటి గొప్ప సినిమాలో మళ్లీ ఆయనతో కలిసి నటించే భాగ్యం దొరికింది అంటూ ఆనందం వెలిబుచ్చింది ప్రగ్య జైస్వాల్. దర్శకుడు బాబీ ఈ కథ చెప్పినప్పుడే పెద్ద హిట్ అవుతుందని నమ్మానని, నిర్మాత నాగవంశీ పాషన్‌తో సినిమా నిర్మించారని ప్రగ్య పేర్కొన్నారు. జనవరి 12 తన పుట్టినరోజు అని, అదేరోజు డాకు మహారాజ్ విడుదల అవుతుండటం సంతోషంగా ఉందని ప్రగ్యా జైస్వాల్ పేర్కొంది.