దిగ్గజ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఘంటసాల ది గ్రేట్. గాయకుడు కృష్ణచైతన్య ఇందులో ఘంటసాల పాత్ర పోషించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల కనిపించనున్నారు. చిన్నతనంలో ఘంటసాలగా అతులిత నటించారు. సి.హెచ్.రామారావు దర్శకత్వంలో సి.హెచ్.ఫణి నిర్మించారు.

ఈ సందర్భంగా స్వరవాహిని, శ్రీభారతి మ్యూజిక్ అకాడమీ కలిసి ఘంటసాల ది గ్రేట్ స్పెషల్ మ్యూజికల్ నైట్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఘంటసాల వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఈ సినిమా చేశామని చిత్ర దర్శకుడు సి.హెచ్ రామారావు తెలిపారు. ఘంటసాల ది గ్రేట్ సినిమాను విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శోభారాణి ఆనందం వెలిబుచ్చారు. ఈ చిత్రం జనవరి 2న ఘనంగా విడుదల కానున్నది.















