Namaste NRI

ఈ సినిమా చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టిస్తుంది: బన్నీ వాస్‌

అఖిల్‌రాజ్‌, త్రిగుణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఈషా. శ్రీనివాస్‌ మన్నె దర్శకుడు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకకు హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ వ్యక్తిగతంగా తాను హారర్‌ సినిమాల్ని ఇష్టపడతానని ఈషా సినిమా చాలా రోజుల పాటు అందరినీ వెంటాడుతుందని అన్నారు.

బన్నీ వాస్‌ మాట్లాడుతూ ఈ సినిమా చూస్తుంటే అందరి వెన్నులో వణుకు పుడుతుందని, హారర్‌ సినిమా ప్రేమికులు బాగా ఎంజాయ్‌ చేస్తారని, పతాక సన్నివేశాలు షాకింగ్‌గా అనిపిస్తాయన్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల్ని భయపెట్టి, ఓ అర్థవంతమైన సందేశాన్ని అందిస్తామని, మంచి సినిమా చూసిన ఫీల్‌తో బయటికొస్తారని వంశీ నందిపాటి పేర్కొన్నారు. చాలా రోజుల పాటు గుర్తుండిపోయే చిత్రమిదని, అంతర్లీనంగా సందేశం కూడా ఉంటుందని దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events