ఆది సాయికుమార్, రియా జంటగా రూపొందిన చిత్రం టాప్‌గేర్ . కె.శశికాంత్ దర్శకుడు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ భాగస్వామ్యంలో కేవీ శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. సందీప్‌కిషన్, సాయికుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రం బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ఆది కెరీర్‌కు బిగ్‌బ్రేక్ అవుతుందనే నమ్మకం వుంది. నిర్మాత శ్రీధర్ రెడ్డి, దర్శకుడు శశికాంత్‌కు కూడా ఈ చిత్రం మంచిపేరును తీసుకరావాలని కోరుకుంటున్నాను అన్నారు. యన్.శంకర్ మాట్లాడుతూ కథతో పాటు మంచి పాటలు, నేపథ్య సంగీతం కూడా కుదిరాయి. ఈ చిత్రంలో ఆది కొత్తగా చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎక్కడా ఆగకుండా టాప్‌గేర్‌లో వెళ్లాలని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు హీరో సందీప్ కిషన్, సాయికుమార్, బెక్కెం వేణుగోపాల్, యన్.శంకర్, దామోదర్ ప్రసాద్, అనిల్ సుంకర, రాధామోహన్ తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.
