Namaste NRI

ఈ ఘటన బయటి ప్రపంచానికి తెలియదు.. రెండు నెలల క్రితమే

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై రెండు నెలల క్రితమే హత్యాయత్నం జరిగిందని, దాని నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్‌ రక్షణ నిఘా విభాగాధిపతి కైరిలో బుడనోవ్‌ సంచలన విషయం వెల్లడిరచారు.  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇది జరిగిందని పేర్కొన్నారు. నల్లసముద్రం, కాస్పియన్‌ సముద్రం మధ్య ఉండే కాకసన్‌ రీజియన్‌ పర్యటనలో అక్కడి ప్రతినిధులు దాడి చేశారని, అయితే ఆ హత్యాయత్నం విఫలమైందని పేర్కొన్నారు. అయితే ఈ  ఘటన బయటి ప్రపంచానికి తెలియదని చెప్పారు. తనపై ఐదుసార్లు హత్యాయత్నాలు జరిగినట్టు 2017లోనే స్వయంగా పుతినే ఓ సందర్భంగా వెల్లడిరచారు. వాటి గురించి ఆందోళన చెందట్లేదని అప్పట్లో పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News