Namaste NRI

అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది :  జె.డి.చక్రవర్తి

జె.డి.చక్రవర్తి, నరేశ్‌ అగస్త్య, సీరత్‌ కపూర్‌ లీడ్‌రోల్స్‌ చేస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ జాతస్య మరణం ధ్రువం. శ్రవణ్‌ జొన్నాడ దర్శకుడు. మల్కాపురం శివకుమార్‌ నిర్మాత. ప్రీతి జింఘానీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా టైటిల్‌ని సజెస్ట్‌ చేసింది తానేనని, ఆ క్రెడిట్‌ తనకే వస్తుందని, నిర్మాత మల్కాపురం శివకుమార్‌ పాషన్‌ ఉన్న నిర్మాత అని, రాజీ పడకుండా సినిమా చేశారని, అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇదని జె.డి.చక్రవర్తి చెప్పారు. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ స్క్రిప్ట్‌ ఇదని హీరో నరేష్‌ అగస్త్య అన్నారు. స్క్రిప్ట్‌ దగ్గర నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వరకూ ప్రతి అడుగులో జెడీ చక్రవర్తి తమకు సపోర్ట్‌ చేశారని దర్శకుడు శ్రవణ్‌ పేర్కొన్నారు. కథను నమ్మి చేసిన సినిమా ఇది. జె.డి.చక్రవర్తి, నరేశ్‌, సీరత్‌ కపూర్‌ పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు సినిమాను అద్భుతంగా తీశాడు. పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నాం  అని నిర్మాత మల్కాపురం శివకుమార్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News