సూర్య శ్రీనివాస్, శివ బొద్దురాజు, జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ఎవోల్. రామ్‌యోగి వెలగపూడి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. దర్శక,నిర్మాత మాట్లాడుతూ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ ఇది. వాణిజ్య విలువలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్.


