రాహుల్, చేతన్, యమీ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 100క్రోర్స్. విరాట్‌చక్రవర్తి దర్శకత్వం. ఈ చిత్రాన్ని దివిజా కార్తీక్, సాయికార్తీక్ నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ డీమానిటైజేషన్ నేపథ్యంలో నడిచే కథ ఇది. 2016లో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని వినోదభరితంగా తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుంది అన్నారు.
నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించే చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. కథానుగుణంగా పాటలకు మంచి ప్రాధాన్యత ఉంటుందని సంగీత దర్శకుడు సాయికార్తీక్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, నిర్మాణ సంస్థ: ఎస్.ఎస్.స్టూడియోస్, దర్శకత్వం: విరాట్‌చక్రవర్తి.