Skip to main content

Namaste NRI

జూనియర్‌ వస్తున్నాడు

గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి, శ్రీలీల జంటగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ద్విభాషాచిత్రం జూనియర్‌. రవిచంద్రన్‌, జెనీలియా కీలక పాత్రలు పోషించారు. రాధాకృష్ణ దర్శకుడు. రజనీ కొర్రపాటి నిర్మాత. ఈ సందర్భంగా రిలీజ్‌డేట్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రధాన తారాగణమంతా ఆనందంగా కనిపిస్తుండగా, జెనీలియా మాత్రం సీరియస్‌ లుక్‌తో దర్శనమిస్తున్నారు.

కుటుంబం అంతా కలిసి చూడదగ్గ భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా అని మేకర్స్‌ చెబుతున్నారు. జూలై 18న సినిమాను విడుదల చేయనున్నట్టు టీమ్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి సంభాషణలు: కల్యాణ్‌ చక్రవర్తి త్రిపురనేని, కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాణం: వరాహి చలనచిత్రం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events