Namaste NRI

ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే కథ : రమణ మూర్తి

సిల్వర్‌ స్క్రీన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ మీద రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్‌.వి.విజయ్ కుమార్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం మరువ తరమా. హరిష్‌ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా ప్రధాన పాత్రల్ని పోషించారు. చైతన్య వర్మ నడింపల్లి దర్శకుడు. ఈ నేపథ్యంలో మేకర్స్‌ నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘు రామ కృష్ణరాజు, హీరోలు నారా రోహిత్‌, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హీరో హరీష్‌ ధనుంజయ్ మాట్లాడుతూ చైతన్య తన ఫ్రెండ్‌కి జరిగిన రియల్‌ స్టోరీనే మరువ తరమా గా మార్చాడు. యూత్‌ ఆడియెన్స్‌కి ఈ చిత్రం బాగా కనెక్ట్‌ అవుతుంది. ప్రతీ ఒక్కరూ థియేటర్‌ నుంచి ఓ నవ్వుతో బయటకు వస్తారని గ్యారెంటీగా చెప్పగలను అని తెలిపారు. డైరెక్టర్‌ చైతన్య వర్మ నడింపల్లి మాట్లాడుతూ నిజాయితీగా ఓ అటెంప్ట్‌ చేశాం. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయం. ఈ మూవీని చూసి నేను సంతృప్తి చెందాను అని చెప్పారు. నిర్మాత రమణ మూర్తి మాట్లాడుతూ చైతన్య చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా కోసం తను ఎంతో కష్టపడ్డాడు. ఈ ప్రయాణంలో మాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్‌. ఓ మంచి కాన్సెప్ట్‌తో ఉన్న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే కథ. ఈనెల 28న మా మూవీని అందరూ చూసి, సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.

నారా రోహిత్‌ మాట్లాడుతూ ఈ మూవీలోని సాంగ్స్‌, లిరిక్స్‌ బాగున్నాయి. కంటెంట్‌ కూడా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ కూడా బాగున్నాయి. హరీష్‌ మాకు చాలా ఏళ్ల నుంచి మంచి మిత్రుడు. ఈ మూవీ పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ చిత్రంలో మాటలు కూడా పాటల్లా ఉన్నాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. హరీష్‌కి మంచి టైమింగ్‌ ఉంటుంది. ఆ టైమింగ్‌ని ఆడియెన్స్‌ ఇష్టపడతారు అని శ్రీ విష్ణు చెప్పారు. ఈ సినిమా ఈనెల 28న విడుదల కాబోతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events