Namaste NRI

కొత్తవారికి ఇదో అద్భుతమైన వేదిక : విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌లో దిల్‌రాజు డ్రీమ్స్‌ వెబ్‌సైట్‌ లాంచ్‌ గ్రాండ్‌గా జరిగింది. హీరో దేవరకొండ విజయ్‌, స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌ ఈ వేడుకకు అతిథులుగా హాజరై ఈ వెబ్‌సైట్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. దిల్‌ రాజు డ్రీమ్స్‌ లక్షలాది మందికి ఒక హోప్‌ ఇచ్చింది. కొత్తవారికి ఇదో అద్భుతమైన వేదిక అని అన్నారు. మరో ముఖ్య అతిథి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ఇలాంటి వెబ్‌సైట్‌ను నేనింతవరకూ చూడలేదు. కొత్తవారి కోసం ఇలాంటిది లాంఛ్‌ కావడం ఆనందంగా ఉంది అని చెప్పారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న కొత్తవారికి సరైన గైడెన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన ఆలోచనే దిల్‌ రాజు డ్రీమ్స్‌. ఇది సినీ ఔత్సాహికులకు సరైన వేదిక అవుతుందని ప్రారంభిస్తున్నాం. అప్లై చేసుకునే వారికి ఆల్‌ ది బెస్ట్‌ అని తెలిపారు. నిర్మాత శిరీష్‌ మాట్లాడుతూ మీ ప్రతిభతో ఎదిగిన తర్వాత ఇండస్ట్రీని మర్చిపోవద్దు అని కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events