సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రానా, సంజయ్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో ఈ నెల 14న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. థియేటర్ లో అందరితో కలిసి చూడాల్సిన చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఇది రీరిలీజ్ కాదని, థియేటర్ లో ఫస్ట్ టైం రిలీజ్ గా భావించాలని, ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో చాలా రిక్వెస్ట్ లు వచ్చాయని, అందుకే థియేటర్ లో రిలీజ్ కు వెళ్లామని రానా తెలిపారు. ప్రేమికుల రోజు ఈ సినిమా రిలీజ్ కు సరైన టైమ్గా భావిస్తున్నానని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tulsi-300x160.jpg)