Namaste NRI

ఇది మ్యాడ్‌ స్కేర్‌ కాదు, మ్యాడ్‌మాక్స్‌ .. నాగచైతన్య

నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్‌ స్కేర్‌.   ఈ చిత్రానికి కల్యాణ్‌శంకర్‌ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు అక్కినేని నాగచైతన్య  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. ఇది మ్యాడ్‌ స్కేర్‌ కాదు, మ్యాడ్‌మాక్స్‌. కామెడీ మనలోని ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇలాంటి సినిమాలు రావడం ఆరోగ్యానికి చాలా మంచిది అన్నారు.   ఇలాంటి సినిమాలు స్నేహాబంధాన్ని బలంగా మారుస్తాయని, కొత్త ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తాయని, ఇందులో నటించిన ముగ్గురు హీరోలు ఇంట్లో కుటుంబ సభ్యుల్లా మారిపోయారని చెప్పారు.

నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ ఒక కామెడీ సినిమా తీసి నవ్వించడమే చాలా కష్టం. అలాంటిది మా దర్శకుడు కల్యాణ్‌శంకర్‌ ఫ్రాంఛైజీ రన్‌ చేస్తున్నారు. భీమ్స్‌ సంగీతం ఈ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేసింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, వెంకీ అట్లూరితో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events