శ్రీకాంత్ ప్రధానపాత్రలో, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రత్యేకపాత్రలో రూపొందుతున్న చిత్రం కోట బొమ్మాళి పీఎస్. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రధారులు. విద్యా కొప్పినీడితో కలిసి బన్నీవాసు నిర్మిస్తున్నారు. తేజా మార్ని దర్శకుడు. ఈ సినిమాలోని శ్రీకాకుళం మాస్ సాంగ్ లింగి లింగి లింగిడి ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ ఒక పాటకు సంబంధించి సక్సెస్‌మీట్ చేయడం ఇదే ప్రథమం. ఈ పాట 14 మిలియన్స్ ఇస్టాగ్రామ్ వ్యూస్‌తో దూసుకుపోతున్నది. తెలుగుజానపదం దమ్ము ఇది అన్నారు. చాలాకాలం తర్వాత ఓ మంచి సినిమా చేశానని హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: నాగేంద్ర కాశి, సంగీతం: రంజిన్ రాజ్, మిథున్ ముకుందన్. నిర్మాణం: జీఏ2 పిక్చర్స్.
