అగ్రరాజ్యం అమెరికా నిఘా సంస్థ.. సెంట్రల్ ఇంటెలిజెన్‌స ఏజెన్సీ (సీఐఏ) సంస్థలో భారత సంతతికి చెందిన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఢల్లీి స్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన నంద్ ముల్‌చందానీ 25 ఏండ్లు సిలికాన్ వ్యాలీలోనూ, అమెరికా రక్షణ శాఖలో సేవలందించారు. ఆయనను సీఐఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ విలియం జే బర్న్స్ ఆదేశాలు జారీ చేశారు. సీఐఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా భారత సంతతి పౌరుడు నిమితులు కావడం ఇదే తొలిసారి. సీఐఏ సీటీవోగా నంద్ ముల్‌చందానీ నియామకాన్ని బర్న్స్ ధృవీకరించారు. సంస్థను టెక్నాలజీ పరంగా బలోపేతం చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అందుకు న్యూ సీటీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. తన టీంలో నంద్ ముల్‌చందానీ భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందని, నూతన బాధ్యతల నిర్వహణలో ఆయనకు గల అపార అనుభవం ఉపకరిస్తుందని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)